చివరకు బాలకృష్ణ ‘రూలర్’ అయ్యాడుగా! ఫిక్స్ చేసేశారు

0
218

ఇటీవలే తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథను తెరపైకి తెచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం తన 105 వ సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Image

తాజాగా దీపావళి కానుకగా బాలకృష్ణ 105 సినిమా టైటిల్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశామని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. గతంలో కేఎస్ రవికుమార్- బాలకృష్ణ కాంబోలో వచ్చిన జైసింహా సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here