మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం.. క్షమాపణ చెప్పిన బాలయ్య

0
476

మీడియా ప్రతినిధులంటే చులకన కాదని రాజకీయ వేత్తలు గ్రహించాల్సిన అవసరం ఉంది. మేమే రాజు, మేమే మంత్రులం అన్నట్లు, తాము ఆడిందే ఆటగా రాజకీయ ప్రముఖులు మీడియాపై ఆవేశం వెళ్లగక్కడం సరికాదు. మీడియాకు పత్రికా స్వేచ్ఛ అనే ఓ హక్కు ఉంటుంది. ఇది మనం నిర్ణయించుకున్నది కాదు.. భారత రాజ్యాంగం కల్పించింది. తమకు పలుకుబడి, డబ్బు, హోదా ఉంది కదా అని.. జర్నలిస్టులకు ఉన్న ఆ హక్కును ఉల్లంగిస్తూ.. అన్యాయం జరుగుతున్నా వీడియో తీయొద్దని, ఫోటో తీయొద్దని జర్నలిస్టులను దబా ఇస్తున్నారు కొందరు. అయితే మీడియా హక్కులకు భంగం కలిగిస్తే తామే దోషులుగా మిగులుతాం అని నిరూపించింది తాజాగా జరిగిన బాలకృష్ణ ఉదంతం. చేసేది లేక బాలకృష్ణ మీడియాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం పర్యటన చేపట్టిన బాలయ్య.. అక్కడ ఓ మీడియా ప్రతినిధిని దూషిస్తూ అనరాని మాటలు అన్నారు. సదరు ప్రతినిధి తీసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలనీ లేదంటే చంపేస్తానని బెదిరించారు. మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా? అని పేర్కొంటూ నోటికొచ్చిన మాటలు అనేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. బాలయ్య తీరుపై అంతా విరుచుకు పడుతున్నారు.

ఇది గమనించిన బాలకృష్ణ చివరకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పి.. తాను చేసిన పనిని సమర్ధించుకునే ప్లాన్ చేశాడు. ‘‘మీడియా మిత్రులకి నమస్కారం.. ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’ అని అన్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇక్కడుంది మీడియా వాళ్లనే విషయం బాలకృష్ణ కు తెలియనట్లయితే.. మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా? అని ఎందుకన్నట్టు? అంటే తప్పు చేసి ఇరుక్కుపోయానని ఇప్పుడు దానికి మసి పుస్తున్నాడా ? ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి మీడియా పట్ల ఇలా వ్యవహరిస్తే.. మరి మిగితా జనానికి మీడియా అంటే లోకువ కాదా! ఇలా ఈ అంశంపై పలువురు మీడియా ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here