తనపై పోలీసుల దాడి విషయమై లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ ఫిర్యాదు

0
102

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ బాబు ఆత్మహత్య నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలో భాగంగా ఎంపీ బండి సంజయ్‌పై డీఎస్పీ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నేడు బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్.. బీజేపీ పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి కామర్స్ బాల సుబ్రహ్మణ్యంతో పాటు వెళ్లి స్పీకర్‌ను కలిశారు.

పార్లమెంటు సభ్యుడు అయిన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్న తనపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్‌స్పెక్టర్ అంజయ్య పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here