‘భీష్మ’ మొదటి వారం బాక్సాఫీస్ వసూళ్లు.. బిగ్గెస్ట్ హిట్

0
256

యంగ్ హీరో నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదలై ఫుల్ టు ఫన్ ఎంటర్టైనర్ గా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లుగా తెలుపుతూ చిత్రబృందం పోస్టర్ ని విడుదల చేసింది. కాగా.. వరల్డ్ వైడ్ గా రూ.23.75 కోట్ల షేర్ ని రాబట్టి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి.. నితిన్ కెరీర్ లో ఈ చిత్రం ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుండి రూ.19.02 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ప్రాంతాల వారీగా కలెక్షన్స్ చుస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ బాక్సాఫీస్ కలెక్షన్స్..

నిజాం: 7.50 కోట్లు
సీడెడ్: 2.85 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.58 కోట్లు
గుంటూరు: 1.54 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.43 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.19 కోట్లు
కృష్ణా: 1.33 కోట్లు
నెల్లూరు: 0.59 కోట్లు
AP&TS: 19.02 కోట్లు

ROI: 1.75 కోట్లు
ROW: 3 కోట్లు
వరల్డ్ వైడ్: 23.75 కోట్లు

‘భీష్మ’ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయిన సందర్బంగా చిత్రబృందం ఫిబ్రవరి 29 న ‘భీష్మ’ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ మీట్ వైజాగ్ సిరిపురంలోని ఉడా కాంప్లెక్స్ వద్దనున్న గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ప్రస్తుతం నితిన్ ‘రంగదే’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రష్మిక మండన్న తన నెక్స్ట్ ఫిల్మ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సుకుమార్ మూవీలో నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here