‘Bheeshma అందుకే నువ్వు సింగిల్ గా ఉన్నావు’ – Rashmika Mandanna

0
29

నితిన్, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘భీష్మ’. దీపావళికి విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా చిత్రబృందం భీష్మ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.

ఇందులో నితిన్ రష్మిక నడుమును చూస్తూ వెనకాలే వెళ్తుంటాడు. సడన్ గా రష్మిక వెనక్కి తిరిగి ఏంటని సైగ చేస్తే నితిన్ నడుము సూపర్ అంటూ సైగ చేస్తాడు. చూస్తుంటే నితిన్ పవన్ కళ్యాణ్ నడుము సీన్ ని వదల్లేదనిపిస్తోంది. ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ మూవీలో కూడా నడుము సీన్ కి మంచి స్పందన రాగా ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు.

ఇదిలా ఉండగా రష్మిక భీష్మ ఫస్ట్ గ్లింప్స్ ను షేర్ చేస్తూ ‘భీష్మ అందుకే నువ్వు సింగల్ గా ఉన్నావు’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘భీష్మ’ టైటిల్ ‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్ తో ఉంటే ఇక్కడ నితిన్ రష్మిక వెనకాల పడుతుండటం చూసి ఒంటరి ఎలా అవుతాడని ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది.

ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై, సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21, 2020 మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here