పవన్‌కు ఊహించని షాక్.. ఇద్దరూ హ్యాండిచ్చేశారు.!

0
246

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలపై స్పందిస్తున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఇసుక సమస్య పైనా పోరాటాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న ఇసుక కొరతపై పవన్ చేస్తున్న ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం మీడియా ముందే ప్రకటన చేశారు. ఇక, ఇదే కార్యక్రమానికి మరిన్ని పార్టీల మద్దతు కూడా ఉంటుందనుకున్న జనసేనానికి రెండు పార్టీలు షాకిచ్చాయి. అవే.. గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేసిన సీపీఐ, సీపీఎం.

‘‘పవన్ కల్యాణ్ గారికి.. విశాఖలో మీరు నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ సమస్యపై మీరు చేపట్టిన కార్యక్రమానికి మా సంఘీభావం తెలుపుతున్నాం. అయితే, ఈ సందర్భంగా బీజేపీ సహకారం సైతం తీసుకోడానికి కూడా అభ్యంతరం లేదని మీ ఆహ్వానం ద్వారా అర్థం అవుతోంది. ఈ వైఖరి మాకు ఆమోదయోగ్యం కాదు. అందువల్ల మీరు చేపట్టిన కార్యక్రమానికి మా ఉభయ పార్టీల నుంచి హాజరు కాలేకపోతున్నాము’’ అని అందులో పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here