నందమూరి అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్

0
154

‘జై సింహా’ వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టిన విషయం తెలిసిందే. ‘రూలర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ముఖ్యమైన పార్ట్‌ను తెరకెక్కించారు.

ఈ సినిమాలోని బాలకృష్ణకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపించాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిచ్చాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

అయితే, ఇటీవల ఇదే సినిమాకు సంబంధించిన మరో పిక్‌ను చిత్ర యూనిట్ వదిలింది. ఇందులో బాలయ్య పోలీస్ గెటప్‌లో కనిపించాడు. మొదటి ఫొటోలకు వచ్చినంత రెస్పాన్స్ ఈ పిక్‌కు రాకపోగా.. విపరీతంగా ట్రోల్ అయిపోయింది. ఈ పిక్‌లోని బాలయ్య లుక్‌ను యాంటి ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. దీంతో ఈసారి అదిరిపోయే రేంజ్‌ లుక్స్ ఉన్న ఫొటోలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here