Bigg Boss Telugu 3 గ్రాండ్ ఫినాలే ప్రోమో… మెగాస్టార్ చిరంజీవి రాక సస్పెన్స్

0
165

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, 105 రోజులుగా ఉత్కంఠగా సాగుతూ చివరి రోజుకు చేరింది. ఈరోజు(నవంబర్ 3) సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనుంది. టైటిల్ విన్నర్ ఎవరో మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగురు శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, అలీ. ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీముఖి, రాహుల్ ల్లోనే ఒకరు టైటిల్ విన్నర్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున ఈ వార్తలను నమ్మొద్దని చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే ప్రోమోని విడుదల చేసారు. గ్రాండ్ ఫినాలేను భారీ స్థాయిలో ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఇందులో బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పాటుగా టాలీవుడ్ స్టార్స్, బుల్లి తెర స్టార్స్ కూడా వేదికపై సందడి చేయనున్నారు. రాశి ఖన్నా కంటెస్టెంట్స్ తో చేసిన హుంగామా, కాథరిన్ ట్రెసా, నిధి అగర్వాల్ తమ అందాలతో వేదికపై అలరించనున్నారు.

కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హీరో శ్రీకాంత్ కూడా గెస్ట్ గా వచ్చారు. అయితే కొద్ది రోజులుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రోమోలో మాత్రం చిరు కనపడకపోవడంతో మెగాస్టార్ ఫినాలేకు వస్తారా లేక ఈ విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారా అనే విషయం ఈరోజు సాయంత్రం రానున్న గ్రాండ్ ఫినాలే చూస్తే గాని తెలియదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here