Bigg Boss Telugu 3 అక్టోబర్ 20 ఎపిసోడ్: వితిక ఎలిమినేషన్…

0
69

ఈ ఆదివారం అక్టోబర్ 20 ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ లో ఉన్న నలుగురు అలీ, శివ జ్యోతి, వరుణ్, వితిక లలో అందరూ ఊహించినట్లుగానే వితిక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. వితిక హౌస్ నుండి వెళ్లిపోయే ముందు తన భర్త వరుణ్ ని కౌగిలించుకుని బాగా ఎమోషనల్ అయ్యింది.

ఎలిమినేషన్ అయిన తర్వాత స్టేజి మీదకు వచ్చిన వితిక ఇంటి సభ్యులందరి గురించి పాజిటివ్ గా మాట్లాడి రాహుల్ గురించి మాత్రం నెగెటివ్ గా మాట్లాడింది. గత కొన్ని రోజులుగా రాహుల్, వరుణ్ వితిక లతో సరిగా లేడని అంతేకాకుండా తాను శివజ్యోతితో గొడవ పడినపుడు రాహుల్ మాట్లాకపోవడం నచ్చలేదని వితిక చెప్పుకొచ్చింది.

తర్వాత వితిక వెళ్లే ముందు వరుణ్ తో ‘సందు బాబు ఐ లవ్ యు…మొన్న నువ్విచ్చిన జ్యువలరీ చాల బాగుంది…బాగా ఆడు’ అంటూ చెప్తుంటే, వరుణ్ ఎమోషనల్ అవుతాడు. ఇక వితిక వెళ్ళిపోతుంది. తర్వాతి వారం మరొకరి ఎలిమినేషన్ జరిగిన తర్వాత మొత్తం ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here