Bigg Boss Telugu 3 అక్టోబర్ 21 ఎపిసోడ్: బాబా భాస్కర్, అలీ మధ్య భీకర పోరు

0
112

వితిక బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయాక వరుణ్ బాధపడుతూ ఉంటే రాహుల్ అలీ వరుణ్ ని నవ్వించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత రోజు అంటే అక్టోబర్ 21 న ఉదయం అందరు చిరంజీవి సాంగ్ తో నిద్ర లేస్తారు. ఈ సాంగ్ కి శ్రీ ముఖి బాబా భాస్కర్ చాల బాగా డాన్స్ చేసారు. ఈ వారం ఒక్కటి మాత్రమే ఫైనల్ టికెట్ ను గెలుచుకుంటారు. మిగిలిన ఐదుగురు నామినేట్ చేయబడతారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు.

బిగ్ బాస్ ఫైనల్ టాస్క్: బ్యాటరీ టాస్క్
ఈ టాస్క్ లో ఒక బోర్డు పై కలర్ బ్లాక్స్ ఉంటాయి. వాటిలో ఎవరికి ఇష్టమైన కలర్ వారు ఆ బ్లాక్ తీసుకోవాలి. ఆ బ్లాక్ మీద వారి బ్యాటరీ పర్సెంటేజ్ రాసి ఉంటుంది. అయితే తర్వత ఇవ్వబోయే టాస్క్ లలో ఓడిపోయిన వారికీ 10% తగ్గుతుంది. గెలిచివారి బ్యాటరీ 10% పెరుగుతుంది.


శివ జ్యోతి – 60%
శ్రీముఖి – 50%
అలీ – 70%
బాబా భాస్కర్ – 40%
వరుణ్ – 40%
రాహుల్ – 50%
అయితే బిగ్ బాస్ బజర్ వినిపించగానే ముందుగా ఎవరైతే ఫస్ట్ బెల్ కొడతారో వారు టాస్క్ చేయవలసి ఉంటుంది.

ఫస్ట్ బజర్: అరటి పండ్లు తినే టాస్క్
శివ జ్యోతి, అలీ బెల్ ని మోగించారు. బిగ్ బాస్ వీరికి ఎక్కువ అరటి పండ్లను తిన్న వారు గెలిచినట్లుగా టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ లో శివ జ్యోతి – 15, అలీ – 21 అరటి పండ్లను తింటారు. ఈ టాస్క్ లో అలీ గెలిచి తన బాటరీ 10% పెంచుకున్నాడు. శివ జ్యోతి బ్యాటరీ 10% తగ్గుతుంది.

సెకండ్ బజర్: థర్మకోల్ బాల్స్ టాస్క్
ఈసారి వరుణ్, రాహుల్ బెల్ ని మోగించారు. బిగ్ బాస్ వీరికి థర్మకోల్ బాల్స్ ఉన్న రెండు బ్యాగులు ఇచ్చి తెరిచి వేసుకొమ్మని అంటాడు. తర్వాత ఎవరైతే తన పోటీదారుని బాగ్ నుండి పూర్తిగా బాల్స్ ని పడేస్తాడో వారు గెలిచినట్లు అని అంటాడు. ఈ టాస్క్ లో రాహుల్ గెలిచి తన బ్యాటరీ ని 10% పెంచుకున్నాడు. వరుణ్ 10% తగ్గించుకున్నాడు.

థర్డ్ బజర్: నోటితో ఆల్ఫాబిట్స్ వేసే టాస్క్
ఈసారి శ్రీ ముఖి, బాబా భాస్కర్ బెల్ మోగించారు. వీరికి బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక పిండి తొట్టె, ఒక ఈకలున్న తొట్టె పెట్టి, అందులో ఆల్ఫాబెట్స్ ని పిండిలో నుంచి ఈకల తొట్టెలో వేయాలి అదికూడా నోటితో వేయాలని టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో బాబా భాస్కర్ గెలిచి తన బ్యాటరీ ని 10% పెంచుకోగా, శ్రీ ముఖి 10% తగ్గించుకుంది.

తర్వాత బిగ్ బాస్ నాలుగవ బజర్ కోసం వేచి చూడమని అంటారు. తర్వాత అర్ధ రాత్రి 1:30am కి బిగ్ బాస్ బజర్ వినియించగానే అందరు లేస్తారు.

నాలుగవ బజర్: ఒక బురద మట్టి ఉన్న ట్రే లో పూలను నాటే టాస్క్
అందరికన్నా ఫస్ట్ ఈసారి అలీ, బాబా భాస్కర్ బెల్ మోగిస్తారు. బిగ్ బాస్ వీరికి పూలను నాటామని ఒక పెద్ద బురద మట్టి ఉన్న ట్రే ని ఇచ్చారు. అయితే బాబా భాస్కర్ నాటిన పూలను అలీ పీకి పారేస్తాడు. దీంతో బాబా భాస్కర్ కూడా అలీ నాటిన పూలను పీకడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది.


ఇక వీరి మధ్య ఏం జరగనుందో తెలుసుకోవడానికి తర్వాతి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here