ముగిసిన బిగ్ బాస్ ఓటింగ్: అలీకి షాక్.. టైటిల్ ఎవరికంటే.?

0
199

ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ దక్షిణాది వారిని మెప్పిస్తోంది తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇది మొదటి సీజన్ నుంచి ఆసక్తికర సన్నివేశాలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగానే సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఎన్నో మలుపులు, మరెన్నో ఊహించని పరిణామాల నడుమ బిగ్ బాస్ సీజన్ -3 తుది అంకానికి చేరుకుంది. రెండు రోజుల్లో ఈ షో విజేత ఎవరో తేలిపోనుంది. ఆదివారం ఈ సీజన్ విజేత ఎవరో ప్రకటించేస్తారు కానీ చాలా మంది అప్పటి వరకు ఆగలేమని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలపై క్లిక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సింప్లీగంజ్, బాబా భాస్కర్, అలీ రెజాలు టాప్ -5లో ఉన్న సంగతి విధితమే. వీరిలో అలీ చివరి స్థానంలో నిలిచాడట. అతడికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయని టాక్. అలాగే, నాలుగో స్థానంలో వరుణ్ సందేశ్, మూడో స్థానంలో బాబా భాస్కర్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టైటిల్ రేసులో మాత్రం శ్రీముఖి, రాహుల్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందట. వీళ్లిద్దరికి సమానంగా ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇంతకీ వీరిలో ఎవరికి ఎక్కవ ఓట్లు వచ్చాయన్నది మాత్రం బయటకు రానీయడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here