Bigil: విజయ్ ‘విజిల్’ మూవీ రివ్యూ…

0
117

విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ”బిగిల్”. గతంలో విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన ‘తెరి’, ‘మెర్సిల్’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బిగిల్’ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్’ టైటిల్ తో రిలీజ్ చేసారు.

ఈ సినిమా పూర్తిగా ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ మహిళా ఫుట్ బాల్ కోచ్ మైఖేల్ గా, ఫుట్ బాల్ ప్లేయర్ బిగిల్ గా, మరియు లోకల్ డాన్ రాయప్పన్ గా 3 గెటప్పుల్లో ద్విపాత్రాభినయం చేసాడు.

ఇక కథ విషయానికొస్తే ఈ సినిమాలో విజయ్ దందాలు చేసే ఒక రౌడీ మైఖేల్ గా ఎంట్రీ ఇస్తాడు. అది కూడా అతను మంచి పనులు చేస్తుండటంతో అతనికి శత్రువులు కూడా ఉంటారు. మైఖేల్ ని ఇష్టపడే అమ్మాయి ఏంజెల్ గా నయనతార చాల బాగా చేసారు. అయితే మైఖేల్ తనకు శత్రువులు ఉన్న కారణంగా ఏంజెల్ తో పెళ్లిని వాయిదా వేస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఒకరోజు మైఖేల్ స్నేహితుడు కిరణ్, మైఖేల్ దగ్గరకు వస్తాడు. ఆ టైంలో మైఖేల్ పై జరిగే దాడిలో కిరణ్ కి తీవ్రమైన గాయాలవుతాయి. అసలైతే కిరణ్, ఆంధ్ర ప్రదేశ్ మహిళా ఫుట్ బాల్ టీం కి కోచ్, వాళ్లు నేషనల్ కప్ కోసం ఢిల్లీ వెళ్తుండగా ఇలా జరగడంతో కిరణ్ స్థానంలో మైఖేల్ కోచ్ గా వెళ్తాడు.

అసలు రౌడీ అయిన మైఖేల్ ఫుట్ బాల్ కోచ్ గా వెళ్లడమేంటి? అంటే ఒకప్పుడు ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయరే ఇప్పటి మైఖేల్. మరి ఫుట్ బాల్ ప్లేయర్ రౌడీ ఎలా అయ్యాడు? మైఖేల్ కోచ్ గా వెళ్లి ఫుట్ బాల్ టీం నేషనల్ కప్ గెలుస్తారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇదిలా ఉండగా సినిమా సెకండ్ హాఫ్ లో లోకల్ డాన్ రాయప్పన్ ఎంట్రీతో సినిమాపై ఉత్సుకత పెరుగుతుంది. పైగా మైఖేల్ తండ్రి రాయప్పన్ అవడం, వీరిద్దరి మధ్య ఆ ఎమోషనల్ సీన్స్ చాల బాగా ఆకట్టుకున్నాయి. అయితే రాయప్పన్ ఎంట్రీ గా యాక్షన్ సీన్స్ లో కూడా విజయ్ యాక్టింగ్ అదరగొట్టాడు. అసలు మైఖేల్ గతం ఏంటి? ఫుట్ బాల్ ప్లేయర్ రౌడీ గా మారడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. ఫుట్ బాల్ సీక్వెన్సెస్ రియలిస్టిక్ గా కనిపించడానికి ఆయన ఎంతగా కష్టపడ్డారో తెలుస్తోంది. అంతేకాకుండా ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని 180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆడవాళ్లపై జరుగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ దానికి ఫుట్ బాల్ నేపధ్యాన్ని జోడించి కమర్షియల్ గా ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు అట్లీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here