బ్రేకింగ్: నోవాటెల్ వద్ద బుల్లెట్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు

0
50

హైదరాబాద్‌లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నేటి తెల్లవారుజామున హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మద్యం మత్తులో రాంగ్ రూట్‌లో వచ్చిన బీఎండబ్ల్యూ కారు.. బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మాదాపూర్‌లోని సాయినగర్ కాలనీకి చెందిన అభిషేక్ ఆనంద్(25) అక్కడికక్కడే మృతి చెందగా.. లీసా చౌదరి(24) అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ అశ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా చాలా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు గుర్తించారు. కేసు విచారణ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here