ఛలో ఆత్మకూరుకు బయల్దేరిన చంద్రబాబు…అడ్డుకున్న పోలీసులు…

0
69

ఈరోజు చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యమానికి బయల్దేరారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు నిరాకరించడంతో చంద్రబాబును, లోకేష్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు శిబిరం లో ఉన్న బాధితులకు భోజనాలను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్షకు దిగారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కానీ ఛలో ఆత్మకూరుకు బయల్దేరిన చంద్రబాబు గారి కాన్వాయి ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు నివాసంలోకి కార్యకర్తలు ప్రవేశించకుండా ప్రధాన గేటుకు పోలీసులు తాడు కట్టారు. దీనితో టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

“ఈ దేశంలో నివసించే హక్కు లేదా? 9 రోజులు సమయమిచ్చాం, పట్టించుకోలేదు. బాధితులను స్వగ్రామాలకు తీసుకువెళ్లే వరకు పోరాటం కొనసాగుతుంది. ఛలో ఆత్మకూరు పై రాజీ పడే ప్రసక్తే లేదు. టీడీపీ నేతల హౌస్ అరెస్టులను ఖండిస్తున్నాం. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు. అచ్చెన్నాయుడిని ఎన్నో పోలీస్ స్టేషన్లు మారుస్తూ వచ్చారు. నేతలను మా ఇంటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నన్ను ఇంట్లో నిర్బంధించి ఉంచారు. ఈ పరిస్థితి దారుణం, దుర్మార్గం. రాష్ట్రం లో అరాచక పాలన సాగుతోంది.” అని పోలీసుల మీద ఫైర్ అయ్యారు చంద్రబాబు.

అంతేకాక “పోలీస్ గో బ్యాక్” అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసులు గుంటూరు లో 144 సెక్షన్ విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here