“ఇస్మార్ట్ శంకర్” మూవీ రీ-రిలీజ్ చేయబోతున్నట్లు ఛార్మి ప్రకటన….

0
354

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన “ఇస్మార్ట్ శంకర్” మూవీ మరల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చెప్పిన మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాక ఈ మూవీలోని రామ్, నిధి అగర్వాల్, నభా నటాషా వీడియో సాంగ్ యు ట్యూబ్ లో రిలీజ్ చేసారు ఒక్కరోజులోనే 3మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 11ఏళ్ల తరువాత బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. హీరో రామ్ కూడా చాలా కాలం తర్వాత సక్సెస్ ను అందుకున్నారు. థియేటర్ల దగ్గర అధిక కలెక్షన్లు కొల్లగొట్టి డైరెక్టర్ పూరీలో, నిర్మాత ఛార్మిలో ఉత్సాహం నింపిన ఈ మూవీని సెప్టెంబర్ 27న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు ఛార్మి సోషల్ మీడియాలో ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ వీకెండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీని ఎంజాయ్ చేయవలసిందిగా ఛార్మి, అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ థియేటర్లు:
దిల్ సుఖ్ నగర్- వెంకటాద్రి
వరంగల్- లక్ష్మణ్
కరీంనగర్- తిరుమల
ఖమ్మం- ఆదిత్య
కాజీపేట్- భవాని

ఏపీ థియేటర్లు:
రాజమండ్రి- ఊర్వశి
కాకినాడ- దేవి
తిరుపతి- విఖ్యాత్
గుంటూరు- స్వామి
వైజాగ్- గోకుల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here