అసెంబ్లీ లో 2019-20 రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

0
99

ఈరోజు ఉదయం 11:30AM కి అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. “అన్ని రంగాలకు 24గంటలు విద్యుత్ ని అందించగలుగుతున్నాం. అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు నమోదైంది. 5ఏళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 5.8% వృద్ధి రేటును సాధించాం. గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. ఏడాదిన్నర కాలం నుండి దేశంలో తీవ్ర ఆర్ధిక మాంద్యం ఉంది. స్థూల దేశీయోత్పత్తి బాగా పడిపోయింది. అందువల్ల తెలంగాణ బడ్జెట్ ను తగ్గించాల్సి వచ్చింది”, అని సీఎం కేసీఆర్ అన్నారు. 11% విమాన ప్రయాణీకుల సంఖ్య పడిపోయింది. ఐటీ ఎగుమతులు రూ. 1,10,000 కోట్లకు పెరిగింది. ఆటోమొబైల్ రంగం లో 3లక్షల మంది ఉపాధి కోల్పోయారని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆర్ధిక మాంద్యం ప్రభావంతో తగ్గిన తెలంగాణ వార్షిక బడ్జెట్ :
ఓటాన్ అకౌంట్ లో లక్షా 82 వేల 17 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలున్నా, ప్రస్తుతం లక్షా 46 వేల 492 కోట్లకు తగ్గిన బడ్జెట్. తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపాదించిన బడ్జెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

2019-20 బడ్జెట్ రూ.1,46,492.30 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ.1,11,055.84 కోట్లు
మూల ధన వ్యయం : రూ. 17,274 కోట్లు
మిగులు బడ్జెట్ : రూ. 2,044.08 కోట్లు
ఆర్ధిక లోటు : రూ. 24,081.74 కోట్లు
రైతు బంధు పధకానికి రూ. 12వేల కోట్లు, పంటల రుణ మాఫీ కి రూ. 6వేల కోట్లు
బడ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ తెలిపారు.
రైతు భీమా పధకాన్ని యధాతధంగా అమలు చేయనున్నామని అన్నారు.

రైతు భీమాకు రూ. 1135 కోట్లు,
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం, గ్రామ పంచాయితీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లు కేటాయించింది. 
విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8వేల కోట్లు,
ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు,
మున్సిపాలిటీలకు రూ. 1,764 కోట్లు,
ఆరోగ్యశ్రీకి రూ. 1,336 కోట్లు కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here