గడువు దాటితే ఇక అంతే: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హెచ్చరిక

0
55

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించారు. మంగళవారం అర్ధరాత్రి వరకూ విధుల్లోకి చేరాలని లేదంటే మిగిలిన 5వేల బస్సులకు కూడా ప్రైవేటు పర్మిట్లు ఇస్తామని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని పేర్కొన్నారు. కార్మికులు విధుల్లో చేరకుంటే హైకోర్టు కూడా తమపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ తీర్పు అనుకూలంగా లేకున్నా కూడా ఆర్టీసీ గానీ, తాము గానీ సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ గడువును సద్వినియోగం చేసుకోవడమా? లేదంటే ఉద్యోగాలను కోల్పోయి.. కుటుంబాలను వీధుల పాలు చేయడమా? అనేది ఉద్యోగులే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి ప్రగతి భవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె విషయంలో, కోర్టు విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here