బాలయ్య కోసం రిస్క్ చేస్తున్న సునీల్..!

9
625

ఒకప్పుడు బ్రహ్మానందం తర్వాత టాప్ కమెడియన్స్ లో ఒకటైన సునీల్ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేసారు. కానీ అవి బెడిసికొట్టడంతో మళ్లీ కమెడియన్ గా సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ మూవీలో సునీల్ విలన్ గా నటించారు. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. మళ్లీ సునీల్ ఇప్పుడు బాలయ్య కోసం అదే రిస్క్ తీసుకుంటున్నట్లు టాక్. అంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 106 వ చిత్రంలో సునీల్ నెగటివ్ రోల్ పోషించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర కోసం కమెడియన్ గా ఉన్నపుడు సునీల్ తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒక పాత్రలో బాలకృష్ణ అఘోరా గా కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

9 COMMENTS

  1. The title of the author is Jere and he completely digs that identify. Her spouse and her selected to reside in New Jersey but her husband wants them to transfer. Doing interior layout is some point she seriously enjoys performing. Hiring is how I assistance my loved kinds and I don’t believe I’ll alter it at any time soon.

  2. After I initially commented I appear to have clicked the -Notify me when new comments are added- checkbox and from now on whenever a comment is added I receive four emails with the same comment. There has to be a means you are able to remove me from that service? Thanks a lot.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here