Breaking News: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

0
67

ఓ వైపు ఆర్టీసీ సమ్మె.. మరోవైపు హైకోర్టు ఆగ్రహం తదితర సమస్యలతో కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్‌కు మరో ఊహించని ఘటన ఎదురైంది.

ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో… 12వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్యచేసుకున్నారు. మృతదేహాన్ని అధికారులు గజ్వేల్‌ మార్చురీకి తరలించారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here