ద‌ర్బార్‌ మూవీ రివ్యూ

0
95

రివ్యూ: ద‌ర్బార్‌
న‌టీన‌టులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, తంబి రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు.
పోరాటాలు: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్
పాటలు: భాస్కర‌భ‌ట్ల‌, కృష్ణకాంత్‌
ఛాయాగ్రహ‌ణం: స‌ంతోష్ శివ‌న్‌
సంగీతం: అనిరుద్ ర‌వి చంద్రన్
నిర్మాత: ఎ.సుభాస్కరన్
ద‌ర్శక‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌
స‌మ‌ర్పణ‌: ఎన్వీప్రసాద్‌
సంస్థ‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
విడుద‌ల‌: 09-01-2020

సూపర్ స్టార్ రజినీకాంత్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కించిన ‘దర్బార్’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటించింది. మురుగ‌దాస్ చేసిన తొలి పోలీస్ క‌థా చిత్రమిది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: నేను బాడ్ కాప్ అంటూ డేంజరస్ రౌడీలందరినీ ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్). డ్రగ్స్ డీలింగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ కి సంబంధించిన వారిని అంతం చేసే క్రమంలో తనకి చాలా ప్రమాదకరమైన అడ్డంకులు వస్తాయి. ఈ క్రమంలో తన కూతురు వ‌ల్లి (నివేదా థామ‌స్) మ‌ర‌ణిస్తుంది. దీంతో దీనంతటికీ వెనక ఉన్న వ్యక్తి హరి చోప్రా అని.. ఎంతోమంది ముంబై పోలీసులను చంపి విదేశాల్లో స్థిరపడతాడు. ఇతన్ని విదేశాల నుండి ఆదిత్య ఎలా రప్పిస్తాడు? ఎలా చంపాడు? తెలుసుకోవడానికీ మూవీ చూడాల్సిందే.

వివరణ: కథ చాలా సినిమాల్లో చూసిందే. కానీ ఏఆర్ మురుగదాస్ అందించిన స్క్రీన్ ప్లే ఈ మూవీకి హైలైట్. దీనికి రజిని స్టైల్, మ్యూజిక్ కూడా తోడయింది. కథ లేకపోయినా స్క్రీన్ ప్లే తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. డిప్యూటీ సీఎం కుమార్తె కిడ్నాప్‌ని ఛేదించ‌డం, ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాని బ‌య‌టికి లాగే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ‘తుపాకీ’ మూవీ నుండి కొన్ని స్క్రీన్ ప్లే సన్నివేశాలను వాడుకున్నాడు. అవి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విదేశాల్లో ఉన్న అజ‌య్ మ‌ల్హోత్రాని తెలివిగా దేశానికి ర‌ప్పించి జైల్లో మ‌ట్టుబెట్టడం మధ్య వచ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

ఇక సెకండ్ హాఫ్ లో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో కథ స్లోగా నడుస్తుంది. ఎలాంటి స‌వాళ్లనైనా అలా.. ఛేదించగల పోలీస్‌ క‌మిష‌న‌ర్ మ‌తిస్థిమితం కోల్పోయిన‌ట్టు క‌నిపించ‌డం అంత‌గా బాలేదనిపించింది. విదేశాల్లో ఉన్న హ‌రిచోప్రాని బ‌య‌టికి ర‌ప్పించ‌డం కోసం మ‌ళ్లీ మైండ్‌గేమ్‌ వైపు వెళ్లిపోయాడు ద‌ర్శకుడు. ఖైదీల‌కి సెల్‌ఫోన్లు ఇచ్చి వాళ్ల ఫోన్ కాల్స్ నుంచి హ‌రిచోప్రా అడ్రస్ క‌నుక్కోవ‌డం అంత ఆకట్టుకోలేకపోయింది. ప‌తాక స‌న్నివేశాలు మామూలుగా ఉన్నాయి. న‌య‌న‌తార పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదనిపించింది.

నటన, సాంకేతికత: రజినీకాంత్ తన స్టైల్తో మంచి జోష్ తో నటించారు. నివేత థామస్ రజిని తండ్రి కూతుర్లుగా సెంటిమెంట్ బాగా పండించారు. నయనతార పాత్ర చిన్నదే అయినా ఆమె పాత్రకు న్యాయం చేసారు. సునీల్ శెట్టి పెద్ద డాన్ అయినా కూడా ఆ రేంజ్ సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సంతోష్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం అనిరుధ్ సంగీతం ఈ మూవీకి హైలైట్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
రజిని స్టైల్
ఫస్ట్ హాఫ్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
కథ
సెకండ్ హాఫ్
పతాక సన్నివేశాలు

రేటింగ్: ఇది ప్రేక్షకుని వ్యక్తిగత అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here