ఆర్టీసీ కార్మికులకు ముగిసిన డెడ్‌లైన్‌.. సీఎం కీలక నిర్ణయం!

0
63

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనని… ముఖ్యమంత్రిగా, మీ నాయకుడిగా, సోదరుడిగా, చెబుతున్నానని.. మీకు ఒక అవకాశం ఇస్తున్నామని పేర్కొంటూ డెడ్‌లైన్ విధించారు.

3 రోజుల్లో అంటే నవంబరు 6వ తేదీలోగా బేషరతుగా డ్యూటీలో చేరితే రక్షణ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ పెట్టిన గడువును ఆర్టీసీ కార్మికులు బేఖాతరు చేశారు. 365 మంది మాత్రమే విధుల్లో చేరిపోయారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తీవ్ర నిర్ణయం దిశగా కేసీఆర్‌ అడుగులు వేయనున్నారని సమాచారం. మిగతా 5000 బస్సులూ ప్రైవేటుకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. పర్మిట్లపై నేడో రేపో నిర్ణయం వెల్లడి కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్‌ తన వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here