హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి పడిపోయిన కారు

0
405

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి ఒక్కసారిగా కారు కింద పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరితో పాటు కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇటీవలి కాలంలో ఈ ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వారంలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here