మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని షాక్.. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

0
212

మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది. నెలరోజులుగా సాగుతున్న హైడ్రామాకు నేటితో తెర పడింది. శనివారం తెల్లవారే సరికి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేసింది. ఈ ఘటనను కనీసం ప్రత్యర్థి పార్టీలు ఊహించను కూడా ఊహించలేదు. సీఎం పదవి కోసం ప్రత్యర్థి పార్టీలతో జత కట్టిన శివసేనకు ఇది భారీ షాక్.

మరికొద్ది గంటల్లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కానీ ఆసక్తికరంగా శివసేనతో చేతులు కలిపిన ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ ఆ పార్టీని ఊహించని దెబ్బ కొట్టింది. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టించి పనిచేస్తారని నమ్ముతున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here