నాగార్జున సరసన దియా మీర్జా..!

0
99

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ‘మన్మథుడు 2’ చిత్రంతో ఓటమిని చవి చూసిన నాగార్జున ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారట.

అయితే ఈ మూవీలో హీరోయిన్ గా 2000 సంవత్సరంలో మిస్ ఏషియా ఫసిఫిక్ కిరీటాన్ని గెలుచుకున్న దియా మీర్జాను ఎంచుకున్నారట. ఈ 38 ఏళ్ల భామ మొదట్లో 12 సినిమాల్లో నటించినా అంతగా పేరు రాకపోవడంతో సినిమాలను వదిలేసి ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోంది.

అయితే ఆమెను నాగార్జున సరసన నటించడానికి ఒప్పించి రీ ఎంట్రీ చేయిస్తున్నారు. నాగార్జున ఈ మూవీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ NIA ఆఫీసర్ గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ముంబై చుట్టు పక్కల ప్రాంతంలో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here