మేము మగాళ్లం కాదు మృగాలం.. సొంత తండ్రిని అన్నదమ్ములని కూడా నమ్మొద్దు- డైరెక్టర్ సుకుమార్

0
147

నిర్భయ కేసు తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యపై పలువురు సెలెబ్రిటీలు వారి స్పందనను తెలియజేస్తున్నారు. ‘మీరు ఎవ్వరినీ నమ్మొద్దు.. సొంత తండ్రిని అన్నదమ్ములని కూడా నమ్మొద్దు.. అప్పుడే మీరు సేఫ్ గా ఉండగలరు’ అంటూ డైరెక్టర్ సుకుమార్ ఈ హత్యాచారాన్ని ఉద్దేశించి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.’

“ప్రియాంకరెడ్డి హత్యాచారం గురించి వినగానే చాల బాధేసింది. ఆ అమ్మాయిని అంత దారుణంగా.. చేసి కాల్చేశారని తెలిసి చాల బాధేసింది. ఇక్కడ బతకాలంటే కూడా భయం భయంగా ఉంది. ఇదంతా చేసిన వాళ్లు కూడా మన మధ్య నుండి వచ్చినోళ్లే. దీనికి ప్రతి ఒక్కరు బాధ్యులే. ప్రియాంక ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. కానీ ఆ క్షణంలో ఆ అమ్మాయి 100కి కాల్ చేయొచ్చు కదా అని అందరు అన్నారు. నేను ఆలోచించాను ఆ అమ్మాయి ఎందుకు 100 కి కాల్ చేయలేదంటే ‘నలుగురు అబ్బాయిలు నా స్కూటీ పాడైతే హెల్ప్ చేస్తున్నారు. ఒకవేళ 100 కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తే.. ఏంటక్కా ఇంత అనుమానపడతావా నీకు హెల్ప్ చేయబోతుంటే.. అని అనుకుంటారేమోనని ఆమె ఫోన్ చేసుండకపోవచ్చు. అంటే అమ్మాయిలు అబ్బాయిలను అంత నమ్ముతారు.

కానీ ప్లీజ్ అమ్మ మీకు చెప్తున్నా.. మేము మగాళ్లం కాదు మృగాలం. మమ్మల్ని నమ్మొద్దు. సొంత తండ్రిని అన్నదమ్ములని కూడా నమ్మొద్దు ప్లీజ్.. ప్రపంచమలా ఉంది. ఏ విషయమైనా సరే మీరు 100 కి ఫోన్ చేసెయ్యండి. తర్వాత సారీ చెప్పొచ్చు..సారీ అన్న మీ మీద అనుమానపడ్డాను ఏమనుకోవద్దు అని చెప్పొచ్చు. ఎవరు గురించైనా అనుమానపడటానికి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకండి. అనుమానంతోనే బతకండి. అప్పుడే మీరు సేఫ్ గా ఉండగలరు.” అని సుకుమార్ తన స్పందనను తెలియజేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here