‘డిస్కో రాజా’ రివ్యూ: స్లోగా సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామా!

0
304

చిత్రం: ‘డిస్కో రాజా’
నటీనటులు:  రవితేజ,నభా నటేష్ పాయల్ రాజ్‌పుత్, బాబీ సింహా, వెన్నెల కిషోర్.
దర్శకత్వం: విఐ ఆనంద్
నిర్మాత‌లు: రామ్ తాల్లూరి
సంగీతం:  ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్:  శ్రావణ్ కటికనేని
సంస్థ: SRT ఎంటర్టైన్మెంట్స్
విడుదల: జనవరి 24, 2020

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో.. ఇప్పుడు మనం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
కొంతమంది వ్యక్తులు వాసు(రవితేజ) కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఒక సైంటిస్టుల గ్రూప్ (తాన్యా హోప్ గ్రూప్) కి మంచులో ట్రెకింగ్ చేస్తుంటే అక్కడ వాసులా ఉండే డెడ్ బాడీ దొరుకుతుంది. అయితే ఈ తాన్యా హోప్ గ్రూప్ చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే అంశంపై పరిశోధన చేస్తుంటారు. అలా బ్రతికిన రవితేజ 30 ఏళ్ల కిందటి పెద్ద గ్యాంగ్ స్టర్ ‘డిస్కో రాజా’. డిస్కో రాజా (రవితేజ) అప్పట్లో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్. అలా అటాక్ లతో, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఎదురులేకుండా సాగుతున్న డిస్కో రాజా, హెలెన్ (పాయల్ రాజ్ పుత్)తో ప్రేమలో పడతాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింహ) ను జైలుకి పంపిస్తాడు.

ఇక ఆ తరువాత డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. అయితే అక్కడ తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి మళ్లీ 30 ఏళ్ల తర్వాత తాన్యా హోప్ గ్రూప్ కి దొరుకుతాడు. మరి వాసు ఏమయ్యాడు? డిస్కో రాజాని చంపిందెవరు? సేతు ఎక్కడున్నాడు? అసలు వాసుకి డిస్కో రాజాకి సంబంధమేంటి? మరి ‘డిస్కో రాజా’ పగ ఎలా తీర్చుకున్నాడు? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.

వివరణ:
డైరెక్టర్ విఐ. ఆనంద్ సైన్స్ ఫిక్షన్ కి యాక్షన్ ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవ్వలేదు. రవితేజ ‘డిస్కో రాజా’ ఫ్లాష్ బ్యాక్ చాలా సాగదీసినట్లనిపిస్తుంది. రొటీన్ కథనే అయినా యాక్షన్ ని జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీలో పాయల్ తో వచ్చే లవ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. నభా నటేష్ రెండు మూడు సీన్స్ లో కంటే ఎక్కువగా కనిపించదు. మంచు కొండల్లో వచ్చే సీన్స్ లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అప్పటి కాలాన్ని.. ఇప్పటి కాలాన్ని చాలా బాగా చూపించారు. రవితేజ, పాయల్ రాజపుట్ లు మెట్రో లుక్ లో చాల బాగున్నారు. చివరిలో వచ్చే ట్విస్ట్ బాగుంది.

ఎవరెలా చేసారంటే:
మాస్ మహారాజ్ రవితేజ రెండు పాత్రల్లో మూడు షేడ్స్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా చేసారు. రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్ మరియు కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సైంటిస్ట్ గా తాన్యా హోప్ చాల బాగా చేసింది. రవితేజ తర్వాత ఈ మూవీలో విలన్ గా బాబీ సింహ యాక్షన్ చాలా బాగుంది. పాయల్ రాజపుట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన హావభావాలు చాల బాగా పలికించింది. డాక్టర్ గా వెన్నెల కిషోర్ చాల బాగా చేసారు. సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ కొంతమేరకు నవ్విస్తుంది. నభా నటేష్ ఉన్నంతలో బాగా చేసింది.

సాంకేతికత:
రొటీన్ కథనే అయినా స్క్రీన్ ప్లే నార్మల్ గా ఉంది. కానీ ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మరియు తమన్ మ్యూజిక్, సాంగ్స్ హైలైట్. ముఖ్యంగా మంచులో తీసిన సీన్స్ లో సినిమాటోగ్రఫీ చాల అద్భుతంగా ఉంది. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
రవితేజ
బాబీ సింహ
సినిమాటోగ్రఫీ
బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ

రివ్యూ: ‘డిస్కో రాజా’ స్లోగా సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామా..

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here