దిశ కేసు: వణుకు పుట్టిస్తున్న నిందితుల నేరాల చిట్టా

0
131

దిశ కేసు దర్యాప్తులో వణుకు పుట్టించే విషయాలు వెలుగు చూశాయి. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుబోయే అంశాలు వెలుగు చూశాయి. దిశ హత్యకు ముందుకు మరో 9మందిని అత్యాచారం చేసి హతమార్చినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఈ తొమ్మిది మందిలో ఆరిఫ్ ఒక్కడే 6 హత్యలు కాగా.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్టు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ.. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌.. కర్నాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం.

ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 15 సంఘటనలు వెలుగు చూశాయి.

వాటన్నింటికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదికలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షల్లో సరైన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. దీంతో శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తునకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దిశ కేసు నిందితుల డీఎన్‌ఏను 15 మంది మృతుల డీఎన్‌ఏలతో సరిపోల్చుతున్నారు. ఒకవేళ అవన్నీ సరిపోతే దిశ కేసు చార్జిషీట్‌లో నిందితుల గత నేరాల చిట్టాను సైతం పొందుపర్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here