దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌

0
133

దిశ హత్య కేసు నిందితులను నేటి తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశ ఘటన జరిగిన ప్రదేశంలోనే… అది కూడా ఆమె హత్య జరిగిన సమయంలోనే ఈ ఘటన జరగడం విశేషం.

పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నిస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్‌ కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది.

కాగా.. గత నెల 27న దిశపై నలుగురు నిందితులూ అత్యాచారం జరిపి.. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. 28న మధ్యాహ్నం నలుగురు నిందితులూ అరెస్ట్‌ చేశారు. 29న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ జరిగింది. 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 4న నిందితులను కోర్టు పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్‌ విచారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here