మాజీ స్పీకర్ “కోడెల శివ ప్రసాదరావు” ఆత్మహత్య…

1
247

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా రోజుల నుండి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనీ, టిఫిన్ చేసాక ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి ఎంతసేపైనా రాకపోయే సరికి వెళ్లి చూస్తే గదిలో ఉరేసుకుని కనిపించారని, గన్ మెన్, డ్రైవర్ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆయన కుమార్తె విజయలక్ష్మి వివరించారు.

“వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి దుర్మార్గాన్ని తట్టుకోలేకపోతున్నాను. రాజకీయం అంటే ప్రత్యర్థులను వెంటాడి వేధించడం కాదు. నన్ను మానసికంగా కుంగదీయాలనేది వీరి లక్ష్యం. 35 ఏళ్లలో కలలో కూడా ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి, కేసుల పేరుతో వెంటాడి, దర్యాప్తు పేరుతో ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం ఇంతగా దిగజారుతుందని ఊహించలేదు.” అని కోడెల కొన్నాళ్లుగా తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు.

బసవతారకం ఆసుపత్రి లోనే ఆయన మరణించడాన్ని అయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయ నేతగా దూకుడు ఉన్నా వైద్యుడుగా సున్నితంగా వ్యవహరించేవారు. ఆయన, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించింది. పార్టీ కోసం కోడెల చివరివరకు పరితపించారు. రాష్ట్రం గొప్ప నేతను కోల్పోయిది. ఇకనైనా ప్రభుత్వం ఈ రాజకీయ వేధింపులను ఆపాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కి ఎన్నో సేవలు చేసి 72 ఏళ్ళ వయస్సులో ఆత్మ హత్య చేస్కోవడం బాధాకరం ఆయన చావుపై పలువురు అనుమానం వ్యక్తం చేసారు.

1947 మే 2 న జన్మించిన కోడెల, 1983,85,89,94,2014 లో నర్సారావు పేట నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 1987-88 మధ్యలో హోమ్ మంత్రిగా పని చేసారు. 1996-97 భారీ మధ్య తరహా, నీటి పారుదల మంత్రిగా, 97-99 మధ్యలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పని చేసారు.

కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. చంద్రబాబు గారు, నారా లోకేష్, కేసీఆర్, కళా వెంకట్రావు, కడియం, MP సుజనా, దర్శనపు శ్రీనివాసరావు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిడిపి నేతలు, కార్యకర్తలు, ఏపీ గవర్నర్ హరిచందన్, తదితరులు కోడెల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసారు.
కోడెల దేహాన్ని పంచనామా కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కోడెలది ఆత్మహత్యగా కేసు నమోదు చేసారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here