దిశ నిందితులకు తొలిరోజే జైల్లో మటన్‌తో భోజనం

0
116

దిశ అత్యాచార ఘటనలో నిందితులైన అరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌, శివలు జైల్లో మటన్‌తో భోజనం చేశారు. ఈ నలుగురిని శనివారం సాయంత్రం చర్లపల్లి జైలుకు తీసుకురాగా.. వారికి ఆదివారం ఉదయం అల్పాహారంగా పులిహోర అందజేశామని జైలు సిబ్బంది తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనంలో 250 గ్రాముల ఆహారాన్ని అందజేశామని వెల్లడించారు. అయితే ఆదివారాల్లో ఖైదీలకు మాంసాహారాన్ని అందజేస్తారు. ఈ నేపథ్యంలో దిశ నిందితులు నలుగురూ ఆదివారం రాత్రి మటన్‌తో భోజనం చేశారని జైలు సిబ్బంది వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here