‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విభా’గా పూజ హెగ్డే ఫస్ట్ లుక్..!

0
162

అఖిల్ అక్కినేని స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు వాసు వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఇటీవల విడుదల చేసిన అఖిల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా..

తాజాగా ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14 న ఈ మూవీ నుండి సెకండ్ స్టెప్ అంటూ పూజ హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో పూజా చాలా క్యూట్ గా. జాయ్ ఫుల్ గా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో పూజా ‘విభా’ పాత్రలో నటించనుంది.

ఈ మూవీలో అఖిల్ పూజల లవ్ ట్రాక్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలిపింది చిత్రబృందం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈషా రెబ్బ కూడా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here