అడుగడుగో యాక్షన్ హీరో.. అరె దేఖో యారో- బాలకృష్ణ ‘రూలర్’ ఫస్ట్ సాంగ్

0
234

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున చిత్రం ‘రూలర్’. ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ‘అడుగడుగో యాక్షన్ హీరో’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరె దేఖో యారో.. అడుగడుగు తనదేం పేరో.. మరి తనదేం ఊరో..’ అంటూ సాగే ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సాయిచరణ్ భాస్కరుని ఈ సాంగ్ ని పాడారు.

ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. డిసెంబర్ 20 న క్రిస్మస్ సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here