మాజీ సీఎం సతీమణి రాధికా కుమారస్వామి…. అరుంధతి తరహా పాత్రలో….

0
116

కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి కథానాయికగా రూపొందుతున్న భారీ చిత్రం ”సంహారిణి”. ఆమె మాజీ సీఎం ను రహస్య వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉన్నారు కానీ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తనకొక కూతురు కూడా ఉంది, తన పేరు శామిక.

2014 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అవతారం’ మూవీతో రాధికా అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా రాధికా, అరుంధతి తరహా ఓ భారీ హారర్ థ్రిల్లర్ చిత్రం ”సంహారిణి” తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇటీవలె ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు. ఇందులో ”శత్రువు గుండెను చీల్చి మృత్యువుతో రుద్రతాండవమాడే దమ..దమ.. దమయంతినిరా నేను…అలాంటి నన్నే దిగ్భంధించేంత దిమాక్ వచ్చిందిరా మీకు..” అనే డైలాగు తో, అరుంధతి తరహా లుక్ తో రాధికా అందరిని ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ థీమ్, మ్యూజిక్ కూడా చాల బాగుంది.

నవరసన్ దర్శకత్వంలో, శ్రీలక్ష్మి వృషాద్రి ప్రొడక్షన్స్ సమర్పణలో, జీఈ గీతా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఆర్.ఎస్. గణేష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం 5 భాషల్లో విడుదల చేయనున్నారు. కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ‘దమయంతి’ పేరుతో, తెలుగులో మాత్రం ”సంహారిణి” టైటిల్ తో విడుదల కానుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here