నలుగురూ కలిసి క్షణక్షణం నరకం చూపించారు.. దిశ హత్యోదంతంపై పూర్తి వివరాలు

0
153

దిశ అత్యాచారం, హత్య కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయంత్రం 6 గంటలకు ఆమె బండి లారీల దగ్గర పార్క్ చేసినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ వెల్లడయ్యాయి. డ్రైవర్లు మహ్మద్‌ అరీఫ్‌, చెన్నకేశవులు, క్లీనర్లు నవీన్‌, శివలు కలిసి ఆమెను అత్యాచారం చేసి, చంపినట్లు రిమాండ్‌ రిపోర్టులో తేలింది. దిశ తన బండిని సాయంత్రం 6 గంటలకు నిందితుల లారీ పక్కనే పార్క్ చేసింది. దిశను చూడగానే ఆమెపై అత్యాచారం జరపాలనే ఆలోచనకు నిందితులు వచ్చారు. దీనికోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

దిశ తిరిగి వచ్చే సమయానికి ఆమె బైక్‌‌కు గాలి తీసి పంక్చర్ అయినట్టు ఆమెను నమ్మించారు. బైకును పంచర్‌ వేయించే పేరుతో శివను బైకుతో పదేపదే బయటకు పంపిస్తూ కాలయాపన చేసి ఆమెను ఎక్కువసేపు అక్కడే ఉండేట్లు చేసి మాట్లాడారు. చివరకు శివ బైకుకు గాలి కొట్టించుకొని వచ్చాడు. దీంతో ఆమె తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ ఆమెను వెళ్లనివ్వకుండా నలుగురరూ అడ్డుకున్నారు. మొదట అరీఫ్‌ ఆమె చేతులు పట్టుకోగా, చెన్నకేశవులు కాళ్లు పట్టుకున్నాడు. నవీన్‌ ఆమె ఫోన్‌ లాక్కుని స్విచాఫ్‌ చేశాడు. ముగ్గురూ కలిసి బలవంతంగా ఆమెను గోడచాటుకు లాక్కెళ్లారు. ఆమె సాయం కోసం అరుస్తున్న సమయంలో నవీన్‌, చెన్నకేశవులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసి, నోరు తెరవకుండా పట్టుకున్నారు. అనంతరం ఆమెపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు.

దీంతో తీవ్ర రక్తస్రావమై.. దిశ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కొంతసేపటికి ఆమె స్పృహలోకి రావడంతో.. అది తమకు ప్రమాదమని అరీఫ్‌ భావించాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకొని.. తలను అదిమి పట్టి తుది శ్వాస విడిచే వరకు ముక్కు, నోరు మూశాడు. దిశ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేశారు. సంఘటన స్థలంలో ఆమె ఆనవాళ్లేమీ లేకుండా చేయడం కోసం పర్సు, క్రెడిట్‌ కార్డు, ఐడీకార్డు, ఫోన్‌ అన్నీ హ్యాండ్‌ బ్యాగులో వేసి లారీలో పెట్టారు. ఆమె లోదుస్తులను మాత్రం అక్కడే వదిలేశారు. దుప్పట్లో చుట్టిన ప్రియాంక మృతదేహాన్ని శివ, నవీన్‌, చెన్నకేశవులు కలిసి లారీ కేబిన్‌లోకి ఎక్కించారు.

అనంతరం అరీఫ్‌ తమ లారీని శంషాబాద్‌ వైపు తీసుకెళ్లాడు. అతనితోపాటు చెన్నకేశవులు కేబిన్‌లో కూర్చున్నాడు. శివ, నవీన్‌‌లకు మాత్రం బైకు మీద వెళ్లి.. పెట్రోల్‌ కొనమని చెప్పారు. శంషాబాద్‌ వద్ద లారీ యూటర్న్‌ తీసుకొని బెంగళూరు వైపు తీసుకెళ్లారు. మళ్లీ చటాన్‌పల్లి దగ్గర లారీ యూటర్న్‌ తీసుకొని, హైదరాబాద్‌ వైపు తిరిగి.. దగ్గర్లోని అండర్‌ పాస్‌ దగ్గర లారీ ఆపారు. మృతదేహాన్ని కిందకు దింపి, డీజిల్‌, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆమె ఫోన్‌ సిమ్‌కార్డును మంటల్లో వేశారు. అక్కడి నుంచి బయల్దేరి నాలుగు గంటలకు ఆరాంఘర్‌ చేరుకున్నారు. లోడ్‌ దింపేసి, ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here