తాజాగా విడుదలైన “వాల్మీకి” ట్రైలర్…

0
86

వరుణ్ తేజ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ “జిగర్తాండ” కు రీమేక్ గా రానుంది. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో మరియు డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం లో అయన క్యారెక్టర్ పేరు గద్దల కొండ గణేష్.

మన పురాణాల్లో ఒక దొంగలోని పరివర్తన అన్నది వాల్మీకి కథ. అదే విధంగా ఈ చిత్రం లో, ఓ రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. అందుకే ఈ చిత్రానికి “వాల్మీకి” అనే టైటిల్ పెట్టారు. సినిమా సినిమాకు వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథ, లుక్స్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్, పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా ‘ముకుంద’ తర్వాత వీరి కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఈ చిత్రంలో ఎనభైల్లో ఉన్న బెల్ బాటమ్ ప్యాంటు తో అప్పటి ఫ్యాషన్ లుక్ లో వరుణ్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో “ఈ మధ్య కాలంలో ఇంటిల్లి పాది చూసే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి… ఒక మంచి సినిమా తీస్తా.. ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ ను కాదురా, ఫామ్ లో ఉన్న డాన్ ను మన సినిమా కోసం వెతికి పట్టుకోవాలి” అంటూ ముందు అధర్వ ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టి గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే డాన్ తో “వాల్మీకి” సినిమా తీసే ప్రయత్నమని స్పష్టమవుతోంది.

వరుణ్ తేజ్, “నా పైన పందాలేస్తే గెలుస్తరు, నాతో పందాలు వేస్తే చస్తరు. ఏమ్ రో…మనం బతుకుతున్నామని పది మందికి తెలియకపోతే ఇక బతుకుడు ఎందుకురా? ఉత్త గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు, గద్దల కొండ గణేష్ అంటే గజ గజ వణకాలే” అనే డైలాగ్ తో తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పూజా హేగ్దే, వరుణ్ తేజ్ మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా మరియు తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హేగ్దే, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ కథా నాయకుడిగా 14 రీల్స్ ప్లస్ పతాకం పై హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ గ్యాంగ్ స్టర్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here