ఇక పై 150 మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ…

4
442

దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైద్య భీమా పథకం ద్వారా నవంబర్1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలోని 150 సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ లో చికిత్స అందుతుందని సీఎం జగన్ తెలిపారు. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుజాతరావు అధ్యక్షతన నియమించిన కమిటీ, 182 పేజీల నివేదికను 100 కు పైగా సిఫార్సులతో బుధవారం సీఎం జగన్ గారికి సమర్పించింది.

కమిటీ సూచించిన అంశాలు:-

1. హాస్పిటల్ బిల్ రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా మార్పులు చేయాలి.
2. ఈ పథకం ద్వారా 2వేల రకాల రోగాలకు వైద్యం అందించడం.
3. 150 మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స.
4. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకునే వారికీ రూ.10,000.
5. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.5000.
6. పక్షవాతం, పుట్టుకతో వచ్చే HIV , బోదకాలు, పోలియో, కుష్టు, తలసీమియా బాధితులకు నెలకు రూ.5000.
7. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్న పేషంట్లు కోలుకునే వరకు రోజుకు రూ.225, ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5000.
8. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేయడం నిషేధం.
9. ప్రభుత్వ వైద్యుల జీతాలను పెంచాలి.
10. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల.
11. 108, 104 ఇతర సేవలకు ఉపయోగించే వాహనాల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలి.
12. స్విమ్స్ హెల్త్ వర్సిటీ ఏర్పాటుకు కమిటీ సిఫార్సు చేసింది.
13. ప్రభుత్వ కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
ఈ అంశాలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు.

కొత్త ప్రతిపాదనలను చేర్చిన ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి1 నుండి అమలు చేయనున్నారు. మిగతా జిల్లాల్లో ఏప్రిల్1 నుండి దశల వారీగా అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కొత్త హెల్త్ కార్డులు డిసెంబర్21 నుండి జారీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నం ప్రాంతాలలో కొత్త వైద్య కళాశాలలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here