సినిమా టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్ విధానం ఇక పై రద్దు…

3
365

ఇక పై సినిమా టికెట్లను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునేది లేదని, ఈ విధానానికి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న పన్ను(రేస్ కోర్స్ టాక్స్) ఇప్పుడు కోట్లల్లో ఉందని, ఈ వ్యవస్థని పూర్తిగా మారుస్తానని ఆయన అన్నారు. ఇకపై ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ విధంగా చేయడం వలన నిర్మాతలకు, పంపిణీ దారులకు ప్రయోజనం ఉంటుందని అయన తెలిపారు.

కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్నవారు మాత్రమే హీరోలుగా పైకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వమే డైరెక్టుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here