పుట్టినరోజన గుడికి వెళ్లిన యువతిపై అత్యాచారం.. హత్య

0
222

వరంగల్: పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లిన యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన వరంగల్‌లో తీవ్ర కలకలం రేపింది. కన్నకూతురు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరంగల్‌లోని హంటర్ రోడ్ సమీపంలో యువతి మృతదేహం ఆమె కుటుంబ సభ్యులకు లభించింది. తన పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లొస్తానని యువతి బయటకు వెళ్లింది.

అయితే తమ కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో యువతి కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. అనుమానం వచ్చి యువతి కోసం వెతకగా కూతురి శవం హంటర్‌రోడ్‌లో కనిపించింది. యువతి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ నిర్వహిస్తున్నారు. యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగిందని.. అనంతరం ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here