వైఎస్‌ జగన్‌కు ఒక్క చాన్స్ ఇవ్వండి: విజయమ్మ

0
294

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోరారు. రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగిస్తూ.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అక్రమాలు చూశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చదువులన్నీ కూడా ఉచితంగా చదివిస్తారని, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తారన్నారు. మద్యాన్ని మూడు దఫాల్లో నిషేదిస్తారని విజయమ్మ వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం వైసీపీ పుట్టిందని ఆమె తెలిపారు.

ఒకసారి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుకుతెచ్చుకోవాలని.. ఇది చేశాను అని చెప్పగలిగే సత్తా, సమర్థత చంద్రబాబుకు ఉందా..? ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు ఉందా..? అని ఈ సందర్భంగా విజయమ్మ ప్రశ్నించారు.” రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు కోసం పుట్టిన పార్టీ వైసీపీ.. ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వైసీపీ. మీకు, మాకు ఉన్న సంబంధం 40 సంవత్సరాల అనుబంధం. 30 సంవత్సరాలుగా మీ భుస్కందాలపై మోసి సీఎంగా చేసుకున్నారు. ఆయన కూడా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మాట కోసం ఓదార్పు యాత్ర చేశారు. వైఎస్‌ కుటుంబం ప్రజల పట్ల కృతజ్ఞత కలిగివుంటుంది. మీ రుణం తీర్చుకోలేదు. మా బిడ్డలను రక్షణకవచంలా కాపాడుకున్నారు” అని విజయమ్మ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.

కుట్రలు చేసి జైలుకు పంపించారు..
తొమ్మిది సంవత్సరాల క్రితం వైఎస్ మరణం తర్వాత మా కుటుంబం ఎదుర్కొన్న కష్టాల కంటే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం మొండిగా పోరాడుతున్నారు. ఓదార్పుయాత్రలో మీరు చూపిన ఆదరణ కాంగ్రెస్‌పార్టీ భరించలేకపోయిందని.. అందుకే జగన్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. వైఎస్ కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం.. రాజశేఖర్‌రెడ్డి మంచోడు.. జగన్‌ మంచోడు.. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చెడ్డవాడు అయిపోయాడా..? అని విమర్శలపై ఆమె ప్రశ్నాస్త్రాలు సంధించారు. “వైఎస్‌ జగన్‌పై కుట్రలు చేసి జైలుకు పంపించారు. ఎన్నడూ జగన్‌ తన కష్టాలను మీ దగ్గర చెప్పుకోలేదు. మీ ఇబ్బందులను,కష్టాలను తెలుసుకున్నారు. ప్రత్యేకహోదా, సమైక్యాంధ్ర కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వైఎస్ బతికున్న కాలంలో నేను ఏరోజు బయటకు అడుగుపెట్టింది లేదు. ఆ రోజు జగన్‌బయటకు వెళ్ళినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని గెలుపించుకోవడానికి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా మీ అభిమానంతోనే బయటకు వచ్చాను” అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నీ అక్రమాలే..
చంద్రబాబు పాలనంతా అన్యాయాలు, అక్రమాలే. హామీ నెరవేర్చే నాయకుడే రాజకీయాల్లోకి రావాలి. వైసీపీ ప్రభుత్వంలో చదువులన్నీ ఉచితం ఉంటాయి. ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. జగన్‌ నాయకత్వంలో ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్‌ జగన్‌ ప్రజల మధ్యలోనే ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం మామ రాజారెడ్డిని హత్యచేశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజశేఖర్‌రెడ్డిని పొగొట్టుకున్నాం. అనుమాసద్పంగా ఆయన మరణించారు.నాలుగు నెలల క్రితం జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హతమార్చడానికి ప్రయత్నించారు. నాటకాలు, డ్రామాలు వేయడం నా కుమారుడికి రాదని, అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరిది వైఎస్‌ వివేకానందరెడ్డిని కిరాతంగా హత్యచేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని అడగడం తప్పా.. చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో జగన్‌ చేశారని మాట్లాడుతున్నారు. వైఎస్‌ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు” అని విజయమ్మ గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here