తెలంగాణ, ఆంధ్రా కబడ్డీ కోచ్ లుగా గోపీచంద్, తమన్నా…

0
591

చాణక్య రిలీజ్ తర్వాత గోపీచంద్, సంపత్ నంది చిత్రంలో నటించబోతున్నారు. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో రానున్న మరో చిత్రమిది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.

క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా, తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా నటించనున్నారు. అంతేకాకుండా ఈ టీమ్ ల మధ్య పోటీ కూడా ఉంటుందట. ఇప్పటికే తమన్నా కబడ్డీ కోచ్ గా రాణించేందుకు ఎల్బీ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం 25 మంది కబడ్డీ ఆటగాళ్లతో పాటు మరికొందరు కొత్త నటులను ఎంపిక చేసారు.

ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినపడుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here