గోపీచంద్ హీరోగా నటించిన సినిమా “చాణక్య” – టీజర్ విడుదల…

0
26

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన యాక్షన్, స్పై, థ్రిల్లర్ చిత్రం “చాణక్య”. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం లో గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు షర వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా టీజర్ సోమవారం సాయంత్రం గం.4.05 నిమిషాలకు విడుదలైంది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here