వెంకటేష్ ‘అసురన్’ రీమేక్ కి డైరెక్టర్ గా హను రాఘవపూడి..

1
196

F2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య తో కలిసి నటిస్తున్నారు. దీని తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌ను కూడా ఆయనే చేయనున్నట్లు ఇప్పటికే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది.

అయితే దర్శకుడు ఇతర టెక్నిషియన్స్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ‘అసురన్‌’ రీమేక్‌ చేసేందుకు పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. హను రాఘవపూడి అయితే చక్కగా సరిపోతారని చిత్ర బృందం భావిస్తోందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఆయన తీయగలరని అనుకుంటోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

‘వెంకీమామ’ వెంకటేష్ 73వ చిత్రం కాగా, తరుణ్ భాస్కర్‌తో చేయబోయే చిత్రం 74, ‘అసురన్‌’ 75వ చిత్రం కానుండటంతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here