ముంబై లో భారీ వర్షాలు…ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించిన అధికారులు…

0
51

ముంబై లో మరలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. థానే, నేవీ ముంబై ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువుల్ని తలపించేలా ఉన్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 38 రూట్లలోని సిటీ బస్సులను దారి మళ్లించారు.
ముంబై రైల్వే ట్రాక్ లపై భారీగా నీరు చేరడంతో రైళ్ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ముంబై విమానాశ్రయంలో 20 విమానాల సర్వీసులను రద్దు చేసారు. సుమారు 300 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరో 2 రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పాల్గర్, రాయఘడ్, రత్నగిరి, సింధు దుర్గ్, ప్రాంతాల్లో అధికారులు ఆరంజ్ అలెర్ట్ ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా సమస్య వస్తే 1916 నెంబర్ కు కాల్ చేయండని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here