నాని ‘టక్ జగదీశ్’ లేటెస్ట్ అప్డేట్..

0
79

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్‌ పెద్ది సాహూ గారపాటి నిర్మించనున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ తన మొదటి సినిమా ‘నిన్ను కోరి’ నానితో తీశారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది.

ఈ చిత్రంలో రీతూ వర్మ ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11 అంటే రేపటి నుండి ప్రారంభం కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది నాని 26 వ చిత్రం. ప్రస్తుతం నాని సుధీర్ బాబుతో కలిసి ‘వి’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. వి మూవీలో నాని నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here