‘చావు కబురు చల్లగా..’ చెప్పిన హీరోయిన్.!

0
196

RX100, 90ML చిత్రాలతో సక్సెస్ ని అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ హీరోగా తన మూడవ సినిమాను.. ఇప్పటివరకు చాలా మంచి సినిమాలను అందించిన బడా సంస్థ గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

అయితే ఈ మూవీలో గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై నేను చేస్తున్న మూడవ చిత్రమిది అంటూ రీసెంట్ గా ‘అర్జున్ సురవరం’ తో సక్సెస్ ని అందుకున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిపింది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను గురువారం ఘనంగా ప్రారంభించారు. కాగా.. ఈ చిత్రంలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ మాస్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here