హైదరాబాద్‌లో దారుణం.. ఎత్తు పళ్లున్నాయని తలాక్ చెప్పిన భర్త!

0
28

వివాహమైన మూడు నెలలకు కానీ తన భార్యకు ఎత్తు పళ్లున్నాయన్న విషయం తెలియలేదు ఆ భర్తకి. ఇంకేముంది.. వెంటనే ట్రిపుల్ తలాక్ చెప్పేసి తన దారి తాను చూసుకున్నాడు. హైదరాబాద్ రాచకొండ కమీషనరేట్ కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా సంచలనానికి దారి తీసింది. కుషాయిగూడ, హెచ్‌బీ కాలనీలో ఉండే రుక్సానా అనే మహిళకు జూన్ 27న రాజేందర్ నగర్, హసన్ నగర్ ప్రాంతానికి చెందిన ముస్తాఫా అనే వ్యక్తితో వివాహమైంది.

పెళ్లి అయిన వారం రోజుల తరువాత నుంచి ముస్తఫా.. రుక్సానాను ఎత్తు పళ్లతో ఉన్నావని, అదనపు కట్నం కావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అతనికి అతని కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. ఈ నేపథ్యంలోనే రుక్సానాకు ముస్తఫా ఎత్తు పళ్లున్నాయనే కారణాన్ని చూపించి తలాక్ చెప్పేశాడు. పుట్టింటికి వెళ్లిపోయిన రుక్సానాకు దిగులుతో ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆమె తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here