నేను బాగానే ఉన్నా.. అంటూ రామ్ చరణ్ సందేశం

0
202

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఈ రోజు ఉదయం జిమ్‌లో కసరత్తు చేస్తుండగా కాలి మడిమ భాగంలో గాయమైంది. ఈ గాయం కారణంగా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పుణెలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు బాగా అప్ సెట్ అయ్యారు.

అయితే తాజాగా తనకు తగిలిన గాయంపై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ”ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు నేను వర్కవుట్ చేస్తుండగా నా యాంకెల్‌కు దెబ్బ తగిలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైద్యులు కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోమని నాకు సూచించారు. మూడు వారాల్లో మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటా” అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రామ్ చరణ్ సందేశంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here