నాకు జగన్‌తో శతృత్వం లేదు.. మనస్పర్థలున్నాయి: హీరో రాజశేఖర్

0
138

వైసీపీకి రోజు రోజుకీ సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ నటులు మంచు మోహన్ బాబు, పృధ్వీ, శివాజీ రాజా తదితరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేడు రాజశేఖర్, జీవిత, హేమ, యాంకర్ శ్యామల తన భర్తతో కలిసి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ…‘చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి జగన్‌ వేరు.. ఇప్పటి జగన్‌ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యమైంది. యువకుడైన వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓ‍టర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, జగన్‌లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here