దొరికిపోతానని ఊహించలేదు: కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి

0
175

కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కీర్తి కేసును విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో కీర్తి బాల్‌రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. విషయం ఇరు కుటుంబాలకు తెలియడం.. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఇరువైపుల పెద్దలూ అంగీకరించారు. ఇంతలో కీర్తి గర్భం దాల్చడం.. దానిని తీయించేందుకు ఇంటి పక్కనున్న శశి సాయం తీసుకోవడం జరిగిపోయాయి.

అయితే శశిని బాల్‌రెడ్డికి కీర్తి తన అన్నగా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి జనవరిలో మహబూబ్‌నగర్‌ జిల్లా అమన్‌గల్‌ ప్రాంతానికి వెళ్లి ఒక గదిని అద్దెకు తీసుకుని ఉన్నారు. కీర్తి అక్కడ అబార్షన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి.. బాల్‌రెడ్డిని వదిలేసి శశి మోజులో పడిపోయింది. శశి కోటీశ్వరుడు కావడంతో అతనితోనే జీవితాన్ని కొనసాగించాలని ఫిక్స్ అయింది.

తల్లికి విషయం తెలిసి మందలించడంతో తాను బాల్‌రెడ్డిని వివాహం చేసుకోనని.. శశినే చేసుకుంటానని తెగేసి చెప్పింది. తల్లి ఒప్పుకోకపోవడంతో శశితో కలిసి తల్లిని అంతమొందించాలని ప్లాన్ చేసింది. తండ్రి లేని సమయంలో తల్లిని దారుణంగా హతమార్చింది. ఆ నేరాన్ని తండ్రిపైనే మోపి చాకచక్యంగా తప్పించుకోవాలనుకుంది.

కానీ పోలీసుల చొరవతో నేరం బయటపడింది. అయితే తాను చేసిన పని బయటకు రాదనుకున్నానని.. ఇలా దొరికిపోతాననుకోలేదని పోలీస్ స్టేషన్‌లో కీర్తి కన్నీళ్లు పెట్టుకుంది. కేసులతో గొడవ అవుతుందనుకోలేదు.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here