తహసీల్దార్ హత్య కేసు నిందితుడు సురేష్ పరిస్థితి విషమం

0
79

తహసీల్దార్ హత్య కేసులో నిందితుడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన సురేష్‌కు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. 24 గంటలు దాటితే శరీరం కాలినందున సెప్టిక్ అయ్యే అవకాశముందని వైద్యులు వెల్లడించారు.

ఈనేపథ్యంలో 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వలేమని పేర్కొన్నారు. కాగా తహశీల్దార్ విజయారెడ్డి కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని అందుకే హత్య చేశానని నిందితుడు సురేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వాలని ఆమెను పలుమార్లు కలిసి వేడుకున్నానని తెలిపాడు. కానీ ఆమె కనికరించలేదని పేర్కొన్నాడు.

సోమవారం ఒక లీటర్ పెట్రోల్‌ను బ్యాగులో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లానని సురేష్ తెలిపాడు. మొదట తనపై పోసుకొని, ఆ తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని సురేష్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here